వైసీపీ ప్రభుత్వానికి ఒక్క చాన్స్ ఇస్తే ముస్లింల అభివృద్ధిని దెబ్బతీసింది: పవన్ కల్యాణ్
- విజయవాడలో జన వాణి కార్యక్రమం నిర్వహించిన జనసేన
- సమస్యల అర్జీలు స్వీకరించిన పవన్ కల్యాణ్
- పవన్ ను కలిసిన మైనారిటీ పరిరక్షణ సమితి సభ్యులు
- మైనారిటీల కోసం బలంగా నిలబడతామని పవన్ హామీ
విజయవాడలో జనసేన పార్టీ నిర్వహించిన జన వాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ కు సమస్యల అర్జీలు వెల్లువెత్తాయి. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కూడా పవన్ కల్యాణ్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధిని దెబ్బతీసిందని విమర్శించారు.
దుల్హన్ పథకం తీసేశారని, మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. మైనారిటీలను అక్కున చేర్చుకుంటామని చెప్పి ఇప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వివరించారు. మైనారిటీలను జనసేన పార్టీ ఓటు బ్యాంకుగా చూడదని, రంజాన్ సమయంలో విందులు ఇచ్చి ఆ తర్వాత వదిలేయడం వంటివి తాము చేయబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మైనారిటీ సోదరుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ బలంగా నిలబడుతుందని స్పష్టం చేశారు.