ఆండర్సన్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన జడేజా
- బర్మింగ్ హామ్ టెస్టులో జడేజా సెంచరీ
- ఏదో కాస్త బ్యాట్స్ మన్ లా అనిపిస్తున్నాడన్న ఆండర్సన్
- ఎప్పుడూ అత్యుత్తమ ఆట ఆడతానన్న జడేజా
- 2014 తర్వాత ఏంజరిగిందో ఆండర్సన్ కు తెలిసివచ్చిందని వెల్లడి
క్రికెట్ లోకంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిగతా జట్లతో పోలిస్తే దూకుడుగా ఉంటారు. అయితే వాళ్ల స్లెడ్జింగ్ మైదానానికే పరిమితం. కానీ ఇంగ్లండ్ ఆటగాళ్లు మాత్రం అందుకు భిన్నం. ఈ ఉదంతమే అందుకు నిదర్శనం. బర్మింగ్ హామ్ లో జరుగుతున్న టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీ నమోదు చేశాడు.
అయితే, ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో చూడండి. "గతంలో జడేజా 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడనుకుంటా. అతడు లోయరార్డర్ ఆటగాడు. ఇప్పుడు కొంచెం ఫర్వాలేదేమో... 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాడు. కాస్త బ్యాట్స్ మన్ అనిపించేలా ఆడుతున్నాడు. అతడి ఇన్నింగ్స్ మాకు కష్టాలు తెచ్చిపెట్టింది" అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలకు జడేజా రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జవాబిచ్చాడు.
"బ్యాటింగ్ కు దిగి కాస్తో కూస్తో పరుగులు చేసేవాళ్లు ఎవరైనా తమను తాము సరైన బ్యాట్స్ మన్ అనే అనుకుంటారు. నా విషయానికొస్తే... క్రీజులోకి వచ్చాక అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలని చూస్తాను. క్రీజులో అవతల ఎవరున్నా, వారితో మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసేందుకు శ్రమిస్తాను. 2014 తర్వాత ఏంజరిగిందో ఆండర్సన్ ఇప్పటికైనా తెలుసుకున్నందుకు సంతోషం" అంటూ బదులిచ్చాడు.