టీఆర్ ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడుతాం: పీయూష్ గోయల్
- కేంద్ర నిధులను టీఆర్ ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది
- తెలంగాణ ప్రజలు నిరాశలో ఉన్నారు
- రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేస్తామని ధీమా
తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి పాలన, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడుతామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందని.. కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేరనే లేదని మండిపడ్డారు. ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హెచ్ ఐసీసీ వద్ద ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు నిరాశలో ఉన్నారని.. వారికి అన్ని రకాలుగా కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పారు. కార్యవర్గ భేటీలో తెలంగాణ పరిస్థితులను డీకే అరుణ వివరించారని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చెక్ పెట్టి.. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ను ఏర్పటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.