రష్యా సైనిక స్థావరంపై ఉక్రెయిన్ రాకెట్ల వర్షం

  • రష్యా ఆధీనంలో ఉన్న మెలిటొపోల్ పై 30 చిన్నస్థాయి క్షిపణులతో దాడి
  • స్థావరం దాదాపు పూర్తిగా ధ్వంసమైనట్టు నగర మేయర్ వెల్లడి
  • ప్రాణ నష్టం వివరాలను ప్రకటించని రష్యా
రష్యా దాడులతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ ప్రతి దాడులను ముమ్మరం చేసింది. అమెరికా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు పంపుతున్న ఆయుధాలతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రష్యా స్వాధీనం చేసుకున్న మెలిటొపోల్ నగరంలో ఉన్న రష్యా సైనిక స్థావరంపై భారీ దాడికి దిగింది. 30కి పైగా స్వల్ప దూరశ్రేణి క్షిపణులను వరుసగా ప్రయోగించింది. మెలిటొపోల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడంతో అక్కడి నుంచి పారిపోయి ఉక్రెయిన్ పరిధిలోకి వచ్చేసిన ఆ నగర మేయర్ ఇవాన్ ఫెడరోవ్ ఈ వివరాలు వెల్లడించారు.
  • రష్యా సైనిక స్థావరం దాదాపు పూర్తిగా ధ్వంసమైపోయినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు.
  • ఉక్రెయిన్ అనుకూల వాదులు మెలిటొపోల్ నగరం సమీపంలో రష్యా నుంచి ఆయుధాలతో వస్తున్న రైలును పట్టాలు తప్పేలా చేశారని వెల్లడించారు.
  • రష్యా సైనిక స్థావరంపై దాడులు జరిగినట్టు ఆ దేశ వార్తా సంస్థ ఆర్ఐఏ కూడా నిర్ధారించింది. కానీ ఏ ప్రాంతంలో జరిగాయి, ప్రాణ నష్టం వివరాలేమీ వెల్లడించలేదు.



More Telugu News