ఈ రోజే బీజేపీలో చేరుతున్నా.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్​

  • స్వయంగా ప్రకటించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • సాయంత్రం బహిరంగ సభలో చేరుతున్నట్టు వెల్లడి
  • కాంగ్రెస్ పై విశ్వాసం పోయిందని ఇంతకు ముందే వ్యాఖ్య
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం రోజునే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బీజేపీ నేతలతో సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ విషయంపై స్వయంగా ట్విట్టర్ లో వివరాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ‘విజయ సంకల్ప సభ’ సందర్భంగా బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. తాను చేసిన ట్విట్టర్ పోస్టులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ఉన్న చిత్రాన్ని కూడా పెట్టారు.

కాంగ్రెస్ పై విశ్వాసం పోయి..
టీఆర్ఎస్ లో ఉద్యమ కారులకు ఏ మాత్రం విలువ లేదని.. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని.. అందువల్ల బీజేపీలో చేరుతున్నానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారమే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు తర్వాత ధనిక రాష్ట్రంగా ఎదుగుతుందని భావించామని.. కానీ టీఆర్ఎస్ పాలనలో పరిస్థితి దారుణంగా తయారైందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేశారు కూడా..



More Telugu News