బీజేపీ రాజ‌కీయ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన అమిత్ షా... అందులోని ప్ర‌ధానాంశాలు ఇవే

  • బెంగాల్‌, తెలంగాణ‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌న్న అమిత్ షా
  • కేర‌ళ‌, ఏపీలోనూ అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌తిపాద‌న‌
  • అన్ని రాష్ట్రాల‌ను ఏకదృష్టితోనే చూస్తామ‌ని పేర్కొన్న వైనం
హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీ కేంద్రంగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్టీ రాజ‌కీయ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అసోం, క‌ర్ణాట‌క సీఎంలు హిమంత బిశ్వ శ‌ర్మ‌, బ‌స‌వ‌రాజ్ బొమ్మైలు ఈ తీర్మానాన్ని బ‌ల‌ప‌రిచారు. ఈ తీర్మానంలో అమిత్ షా ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌తిపాదించారు. ఈ తీర్మానంపై సుదీర్ఘ చ‌ర్చ కొన‌సాగుతోంది.

కొత్త‌గా తెలంగాణ‌తో పాటు ప‌శ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని స‌ద‌రు తీర్మానంలో అమిత్ షా ప్ర‌తిపాదించారు. అంతేకాకుండా కేర‌ళ‌, ఏపీలోనూ పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా బీజేపీ ఏ ఒక్క రాష్ట్రాన్ని ప్ర‌త్యేక దృష్టితో చూడ‌ద‌ని, దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను ఏక‌దృష్టితోనే చూస్తుంద‌ని అమిత్ షా ఆ తీర్మానంలో పేర్కొన్నారు.


More Telugu News