దేశంలో మరో 16 వేల మందికి కరోనా

  • 24 గంటల్లో 31 మంది మృతి
  • యాక్టివ్ కేసులు లక్షా 11 వేల పైనే
  • రోజువారీ పాజిటివిటీ రేటు 4.27 శాతం
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16 వేల 103 కొత్త కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 2,143 కేసులు ఎక్కువ రావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1 లక్ష 11 వేల 711కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 4,35,02,429కి చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉండగా.. ఈ వారంలో పాజిటివిటీ రేటు 3.81 శాతంగా నమోదైంది. 
 
గడచిన 24 గంట్లలో కరోనా వల్ల 31 మంది మరణించారు. వీరిలో ఒక్క కేరళలోనే 14 మంది మృతి చెందారు.  మహారాష్ట్రలో ఐదుగురు చనిపోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 21 వేల 199కి చేరుకుంది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. అయితే, కరోనా మరణాల్లో 70 శాతం మంది ఇతర దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

 ఇక, కరోనా  నుంచి ఇప్పటిదాకా 4 కోట్ల 28 లక్షల 65 వేల 519 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటిదాకా 197.955 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


More Telugu News