లగేజీ బ్యాగ్​లో ఏముందంటే బాంబ్​ అన్న ప్రయాణికుడు... విమానం ఎక్కకుండా అరెస్టు చేసిన పోలీసులు

  • విదేశాలకు వెళ్లేందుకు కొచ్చి ఎయిర్ పోర్టుకు వచ్చిన దంపతులు
  • చెక్-ఇన్ కౌంటర్లో బ్యాగ్ చెక్ చేస్తూ ఏముందని అడిగిన సిబ్బంది
  • బాంబు అని కామెంట్ చేయడంతో భయాందోళన
ఎక్కడేం మాట్లాడాలో తెలియాలి. అనవసరంగా నోరు పారేసుకుంటే అనర్థాలు వస్తాయి. కొచ్చి విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటన ఇందుకు ఉదాహరణ. సరదాగా ‘బాంబ్’ అనే పదాన్ని ఉచ్ఛరించినందుకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విదేశాలకు వెళ్లడం కోసం 63 ఏళ్ల వ్యక్తి, అతని భార్య శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.  

చెక్-ఇన్ కౌంటర్‌లోని విమానాశ్రయ సిబ్బంది వారి లగేజీ చెక్ చేస్తుండగా.. బ్యాగులో ఏముంది అని అడిగారు. సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నకు విసుగు చెందాడో లేక సెటైర్ వెయ్యాలనుకున్నాడో గానీ భర్త ‘బాంబు’ అని చెప్పాడు. అంతే అక్కడున్న సిబ్బందితో పాటు ప్రయాణికుంతా భయాందోళనలకు గురయ్యారు.

దాంతో, ఆ దంపతులను విమానం ఎక్కేందుకు సిబ్బంది నిరాకరించారు. విమనాశ్రయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది దగ్గర్లోని నెడుంబస్సేరి పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.


More Telugu News