మైసూరులో న‌రేశ్‌, ప‌విత్రా లోకేశ్!.. చెప్పుతో దాడి చేసేందుకు య‌త్నించిన ర‌మ్య‌!

  • ప‌విత్రా లోకేశ్‌తో క‌లిసి మైసూరు వెళ్లిన న‌రేశ్
  • కొంత‌కాలంగా స‌న్నిహితంగా ఉంటున్న సినీ న‌టులు
  • వీరి బంధంపై న‌రేశ్ మూడో భార్య ర‌మ్య ఆగ్ర‌హం
  • ర‌మ్య‌ను ఉడికించేలా విజిల్స్ వేసిన న‌రేశ్‌
టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్‌, కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్రా లోకేశ్‌ల‌కు మైసూరులో అనూహ్య ఘ‌ట‌న ఎదురైంది. వీరిద్ద‌రూ క‌లిసి వెళుతుండ‌గా.. వీరిపై న‌రేశ్ భార్య రమ్య దాడి చేసేందుకు య‌త్నించింది. ప‌విత్రా లోకేశ్‌పై ఏకంగా చెప్పు తీసుకుని ఆమె దాడి చేసేందుకు య‌త్నించింది. అయితే న‌రేశ్, ప‌విత్రా లోకేశ్‌ల‌కు సెక్యూరిటీగా వ‌చ్చిన పోలీసులు ర‌మ్య‌ను అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు ప‌లు న్యూస్ ఛానెళ్ల‌లో వైర‌ల్‌గా మారిపోయాయి. 

త‌మ‌పై దాడి చేసేందుకు య‌త్నించిన ర‌మ్య‌ను మ‌రింత‌గా ఉడికించేందుకు న‌రేశ్ యత్నించాడు. ర‌మ్య‌ను చూసి విజిల్ వేస్తూ ఆయ‌న వెళ్లిపోయాడు. అంతేకాకుండా చేయి ఊపుతూ,  ర‌మ్య గురించి కామెంట్ చేస్తూ వెళ్లిపోయాడు. త‌న భ‌ర్త‌ను త‌న‌కు ద‌క్క‌కుండా ప‌విత్రా లోకేశ్ చేస్తోంద‌ని ర‌మ్య ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే న‌రేశ్... ప‌విత్రా లోకేశ్‌ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ కూడా ర‌మ్య ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.

న‌రేశ్‌కు అప్ప‌టికే రెండు పెళ్లిళ్లు కాగా... ర‌మ్య ఆయ‌న‌కు మూడో భార్య‌. ర‌మ్య‌తో చాలా కాలంగా దూరంగానే ఉంటున్న న‌రేశ్... తాజాగా ప‌విత్రా లోకేశ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడు. వీరి బంధంపై పెద్ద ఎత్తున పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే స్పందించిన న‌రేశ్ త‌మ మ‌ధ్య స్నేహం మాత్ర‌మే ఉందంటూ వ్యాఖ్యానించాడు. ప‌విత్రా లోకేశ్ మాత్రం న‌రేశ్‌కు ఆత్మీయ తోడు అవ‌స‌ర‌మ‌ని, కొంత‌కాలంగా అత‌డికి మానసికంగా అండ‌గా నిలుస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలోనే ర‌మ్య వీరిద్ద‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వారిపై దాడికి య‌త్నించింది.


More Telugu News