పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం.. స్వయంగా హారతిచ్చిన యోగి.. వీడియో ఇదిగో
- జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన యోగి
- పాతబస్తీ పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలతో భద్రత
- బహిరంగ సభ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదయం చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వయంగా హారతిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, యోగి పాతబస్తీ వస్తుండడంతో కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, ఈ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దాదాపు 10 లక్షల మందిని ఈ సభకు తరలించాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.