విదేశాల్లో ఉన్నవారి నుంచి ఇకపై రూ.10 లక్షల వరకు అందుకోవచ్చు... కేంద్రానికి వివరాలు చెప్పనక్కర్లేదు!

  • గతంలో ఈ పరిమితి రూ.1 లక్ష
  • పరిమితి పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్
  • ఎఫ్ సీఆర్ఏలో మార్పులు
  • ఆమోదించిన కేంద్ర హోంశాఖ
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్ సిఆర్ఏ)లో మార్పులు చేసింది. తద్వారా, విదేశాల్లో ఉన్నవారి నుంచి భారత్ లో ఉన్నవారు ఏడాదికి రూ.10 లక్షల వరకు నగదు అందుకోవచ్చు. అందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం, వివరాలు సమర్పించనక్కర్లేదు. గతంలో ఈ పరిమితి రూ.1 లక్షగా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.10 లక్షలకు పెంచారు. అంతేకాదు, ఒకవేళ నగదు పరిమితి దాటితే ప్రభుత్వానికి సమాచారం అందించాల్సిన గడువును కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది.  

ఈ మేరకు కేంద్ర హోంమత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎఫ్ సీఆర్ఏలోని రూల్ 6లో మార్పులకు ఆమోదం తెలుపుతున్నట్టు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.


More Telugu News