ముఖ్యమంత్రి గారూ... మీ విచిత్రమైన పాలనలో ఏదైనా సాధ్యమే!: వర్ల రామయ్య వ్యంగ్యం
- శ్రీ సత్యసాయి జిల్లాలో తెగిపడిన హైటెన్షెన్ వైర్లు
- ఐదుగురు సజీవదహనం
- కరెంటు వైర్లపై ఉడుత ఎక్కిందన్న అధికారులు
- స్పందించిన వర్ల రామయ్య
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇటీవల విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపడి ఓ ఆటో దగ్ధం కాగా, అందులోని ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనమయ్యారు. ఓ ఉడుత విద్యుత్ వైర్లపైకి ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ అయిందని, హైటెన్షన్ వైర్లు తెగిపోవడానికి ఆ ఉడుతే కారణమని విద్యుత్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు.
ముఖ్యమంత్రి గారూ... మీ విచిత్రమైన పాలనలో ఏదైనా సాధ్యమేనంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఉడుత ఊపులకు చింతకాయలు రాలతాయో లేదో కానీ, హైటెన్షన్ కరెంట్ తీగ మాత్రం తెగుతుందని ఎద్దేవా చేశారు.
అంతేకాదు, గతంలో జరిగిన పలు సంఘటనలకు ప్రభుత్వం చెప్పిన కారణాలను కూడా వర్ల రామయ్య ఈ సందర్భంగా ప్రస్తావించారు. పిల్లి మద్యం తాగదు కానీ, ఎలుకలు మాత్రం మస్తుగా మందు తాగుతాయని పేర్కొన్నారు. తేనెటీగలు కుడతాయని తెలుసు గానీ, మీ హయాంలో అవి రథాలు కూడా తగలబెడుతున్నాయి.... నిజమా? అంటూ ప్రశ్నించారు.