మాట మీద నిలబడటం అంటే ఏంటో కేసీఆర్కు తెలియదు: వైఎస్ షర్మిల
- ఓట్లు కావాల్సినపుడు రావడం, మాయ మాటలు చెప్పడం, మళ్లీ ఫామ్ హౌజ్ కు వెళ్ళడమే సీఎం తీరు అని విమర్శ
- ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అమ్ముడు పోయానన్న షర్మిల
- ప్రజల తరపున పోరాటం చేయడానికే వైఎస్ఆర్ టీపీ పుట్టిందని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాట మీద నిలబడటం అంటే ఏంటో కేసీఆర్ కు తెలియదని విమర్శించారు. ఓట్లు కావాల్సినప్పుడు రావడం, మాయ మాటలు చెప్పడం, మళ్లీ ఫామ్ హౌజ్ కు వెళ్ళడం.. ఎనిమిదేండ్లుగా ఇదే తీరుతో కేసీఆర్ పాలన నడుస్తున్నదని షర్మిల ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున పోరాటం చేయడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని ఆమె ట్వీట్ చేశారు.
ప్రజా ప్రస్థాన యాత్ర పేరుతో షర్మిల తెలంగాణలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాత్ర శనివారంతో 112వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం హుజూర్ నగర్ లో షర్మిల పర్యటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఆయా సభల్లో ప్రభుత్వంపై సూటిగా విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మాట మీద నిలబడరని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.