మరో రీమేక్‌లో పవర్ స్టార్ పవన్.. రహస్యంగా పూజ చేసేశారు
- తమిళ్ హిట్ చిత్రం ‘వినోదాయ సిత్తం’ రీమేక్ కు పవన్ అంగీకారం!
- సాయిధరమ్ తేజ్ కీలక పాత్ర
- తమిళ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం
- తెలుగులోనూ ఆయనే తీస్తాడని టాక్
అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘భీమ్లా నాయక్’తో మంచి హిట్ అందుకున్న పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ చిత్రం చేస్తున్నాడు. దీనికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించే ‘భవదీయుడు భగత్‌సింగ్’ను లైన్లో పెట్టాడు. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని పవన్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది.
సముద్రఖని దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘వినోదాయ సిత్తం’ రీమేక్‌లో పవన్ నటించనున్నారని, అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో కీలక పాత్ర పోషిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ ఒకే అయిందని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. రహస్యంగా పూజ కూడా జరిగిందట. ఈ నెల 12 నుంచి మొదలవుతుందని సమాచారం.
తమిళ మాతృకను తీసిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వం వహిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ కూడా ఈ చిత్రంలో పాలు పంచుకుంటున్నాడట. మాతృకకు కొద్దిగా మార్పులు చేసి స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని అంటున్నారు. సినిమాకు సంబంధించి తొందర్లోనే ప్రకటన వస్తుందని తెలుస్తోంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను కూడా అప్పుడే ప్రకటిస్తారు.