ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

  • వైసీపీకి సహకరించని అధికారులను టార్గెట్ చేస్తున్నారు
  • ప్రజాస్వామ్య వ్యవస్థలపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు
  • కోర్టు తీర్పులను కూడా జగన్ లెక్క చేయడం లేదు
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులు కూడా గడవక ముందే ఆయనను ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఏబీవీ సస్పెన్షన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థలపై ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని అధికారులను టార్గెట్ చేస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వైఖరి వల్ల అధికారుల్లో అభద్రతాభావం నెలకొంటుందని చెప్పారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. కోర్టు తీర్పులను సైతం జగన్ లెక్క చేయడం లేదని చెప్పారు. జగన్ చేస్తున్న కక్ష సాధింపు చర్యల వల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభాసుపాలయిందని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుపై తక్షణమే సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వ్యవస్థల పట్ల నమ్మకం కలిగేలా వ్యవహరించాలని హితవు పలికారు.


More Telugu News