ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా సంచలన వ్యాఖ్యలు
- ఏపీలో ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం ట్రెండ్ నడుస్తోందన్న డొక్కా
- అటు తెలుగు, ఇటు ఇంగ్లిష్ భాషల్లో ఏదీ సరిగ్గా నేర్చుకోలేరని ఆవేదన
- భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుందని వ్యాఖ్య
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ భాషావేత్త చేకూరి రామారావు (చేరా) సర్వలభ్య రచనలను మనసు ఫౌండేషన్ నాలుగు సంపుటాలుగా ప్రచురించింది. ఆయన జయంతిని పురస్కరించుకుని నిన్న హైదరాబాద్‌లోని తెలుగు వర్సిటీలో ఆ పుస్తకాలను చేరా జీవిత భాగస్వామి రంగనాయకి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన డొక్కా మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం ట్రెండ్ నడుస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని అమలు చేయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు ఇక్కట్లు తప్పవన్నారు. అటు తెలుగు, ఇటు ఇంగ్లిష్ భాషల్లో ఏదీ సరిగ్గా రాక ఇబ్బంది పడతారని అన్నారు. మనిషి ఆలోచనలు మాతృభాషలోనే పరిఢవిల్లుతాయని డొక్కా వివరించారు.