ద్రౌపది ముర్ముకు మరో రెండు పార్టీల మద్దతు
- రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము
- దేవెగౌడ, బాదల్‌లతో మాట్లాడిన జేపీ నడ్డా
- జేడీఎస్, అకాలీదళ్‌ల మద్దతు ముర్ముకేనన్న ఆ ఇద్దరు నేతలు
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ముకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఆమె విజయానికి అవసరమైన మద్దతు లభించగా...తాజాగా మరిన్ని పార్టీలు ఆమెకు మద్దతు పలుకుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), జనతాదళ్ సెక్యూలర్ (జేడీఎస్) పార్టీలు తమ మద్దతును ముర్ముకు ప్రకటించాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, జేడీఎస్ నేత హెచ్‌డీ దేవెగౌడతో చర్చలు జరిపారు. తాము ప్రతిపాదించిన ముర్ముకు మద్దతు ప్రకటించాలని ఆయన వారిద్దరినీ కోరారు. జేపీ నడ్డా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆ ఇద్దరు నేతలు తమ పార్టీల మద్దతు ముర్ముకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.