జూన్ మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇవిగో!

  • రూ.1.44 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
  • గత ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్లు
  • జూన్ మాసపు వసూళ్లు రెండో అత్యధికం
  • వరుసగా నాలుగోసారి రూ.1.40 లక్షల కోట్లకు పైన వసూళ్లు
గత నెల (జూన్)కు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరుసగా నాలుగో నెల కూడా రూ.1.40 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలైనట్టు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జూన్ లో జీఎస్టీ వసూళ్లు రూ.1.44 లక్షల కోట్లు కాగా, 56 శాతం పెంపు నమోదైంది. గత ఏప్రిల్ లో రూ.1.67 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలు కాగా, జీఎస్టీ ప్రవేశపెట్టాక ఇప్పటివరకు అదే అత్యధికం. ఆ తర్వాత జూన్ మాసపు వసూళ్లే రెండో అత్యధికం. మే నెలలో రూ.1.40,885 కోట్ల జీఎస్టీ వసూలైంది.


More Telugu News