మళ్లీ మొదలైన ఆట... 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • బర్మింగ్ హామ్ టెస్టు
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
  • విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్లు
  • కష్టాల్లో టీమిండియా
  • 3 వికెట్లు తీసిన ఆండర్సన్
  • పాట్స్ కు రెండు వికెట్లు
బర్మింగ్ హామ్ టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కష్టాల్లో పడింది. వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్ మళ్లీ మొదలవగా, భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి 2 వికెట్లకు 53 పరుగులు చేసిన టీమిండియా... ఆ తర్వాత మరో 3 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు 32 ఓవర్లలో 5 వికెట్లకు 109 పరుగులు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (18 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 

కాగా, ఓపెనర్లు గిల్, పుజారాలను పెవిలియన్ చేర్చిన ఆండర్సన్... తన ఖాతాలో మరో వికెట్ కూడా చేర్చుకున్నాడు. 15 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ ను అవుట్ చేశాడు. అంతకుముందు, కొత్త బౌలర్ మాథ్యూ పాట్స్ కొద్ది వ్యవధిలోనే హనుమ విహారి (20), విరాట్ కోహ్లీ (11)లను అవుట్ చేసి, టీమిండియాను గట్టి దెబ్బకొట్టాడు.


More Telugu News