పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా?... మళ్లీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమే: చంద్రబాబు హెచ్చరిక
- మంగళగిరిలో చంద్రబాబు మీడియా సమావేశం
- కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం
- అవసరమైతే తాను పోలీస్ స్టేషన్ కు వెళతానని వెల్లడి
- తప్పుడు అధికారులను వదిలిపెట్టబోమని స్పష్టీకరణ
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 600 మందిపై కేసులు నమోదు చేశారని వివరించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెడుతున్నారని, అవసరమైతే తాను పోలీస్ స్టేషన్ కు వెళతానని స్పష్టం చేశారు.
కొందరు సైకో ప్రవర్తన ఉన్న పోలీసు అధికారులతో నిబంధనలకు విరుద్ధంగా చిత్రహింసల పాల్జేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? అని ప్రశ్నించారు. సాంబశివరావు, వెంకటేశ్ ల ఇళ్లకు వెళ్లి బెదిరించారని, ఇంటి గోడలు దూకడం, లైట్లు పగలగొట్టడం ఏంటని చంద్రబాబు నిలదీశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వతమేనని... తప్పుడు అధికారులను వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.