కేరళలో రాహుల్ గాంధీ... కార్యాలయంపై దాడి తర్వాత తొలిసారి వయనాడ్‌కు కాంగ్రెస్ ఎంపీ
- వయనాడ్ ఎంపీగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ
- ఇటీవలే రాహుల్ వయనాడ్ కార్యాలయంపై దుండగుల దాడి
- కన్నూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా వయనాడ్ చేరిక
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం కేరళ పర్యటనకు వెళ్లారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచే కాకుండా కేరళలోని వయనాడ్ నుంచి కూడా ఆయన ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అమేథీలో ఓడిన రాహుల్.. వయనాడ్‌లో గెలిచారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన వయనాడ్ ఎంపీగానే లోక్‌సభలో కొనసాగుతున్నారు. తనను గెలిపించిన వయనాడ్ ప్రజల సమస్యలపై బాగానే దృష్టి పెడుతున్న రాహుల్... క్రమం తప్పకుండా వయనాడ్ వెళ్లి వస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వయనాడ్‌లో రాహుల్ గాంధీ కార్యాలయంపై ఇటీవలే గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయంలోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాహుల్ వయనాడ్ వెళ్లలేకపోయారు. తాజాగా శుక్రవారం ఆయన వయనాడ్ పర్యటనకు వచ్చారు. శుక్రవారం ఉదయమే ఢిల్లీ నుంచి నేరుగా కేరళలోని కన్నూరు ఎయిర్‌పోర్ట్ చేసిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా వయనాడ్ బయలుదేరారు.