ఐదో టెస్టులో టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్!
- 5 టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 4 మ్యాచ్‌లు పూర్తి
- కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టు
- బర్మింగ్‌హామ్ వేదికగా మొదలుకానున్న మ్యాచ్
- సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో టీమిండియా
- టీమిండియా కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఐదు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ జట్టు 2-1 ఆధిక్యతను సాధించిన సంగతి తెలిసిందే. నేటి ఐదో టెస్టులో విజయం సాధించినా, లేదంటే మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా... సిరీస్ భారత్ వశం కానుంది. అలా కాకుండా ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం చేతిదాకా వచ్చిన సిరీస్ టీమిండియా చేజారిపోతుంది. ఇంగ్లండ్ గడ్డపై అంత మెరుగైన ఫలితాలేమీ రాబట్టని టీమిండియా ఈ మ్యాచ్‌లో సత్తా చాటి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇదిలా ఉంటే... జట్టుకు చెందిన ఓ ఫాస్ట్ బౌలర్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా కాలం తర్వాత చూస్తున్నాం. గతంలో కపిల్ దేవ్ హయాంలో మాత్రమే టీమిండియా టెస్టు జట్టుకు ఫాస్ట్ బౌలర్ నాయకత్వం వహించాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి.