మూడు సార్లు పెళ్లి వరకు వచ్చా.. దేవుడే కాపాడాడు: సుస్మితాసేన్
- తన పెళ్లికి పిల్లలు అడ్డు కాదన్న సుస్మిత
- ఎవరు వచ్చినా ఆహ్వానించేందుకు వారు సిద్ధంగా ఉన్నారని ప్రకటన
- ఓ వ్యక్తి తనను నిరుత్సాహ పరిచినట్టు వెల్లడి
మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ తాను పెళ్లికి దూరంగా ఉండడం వెనుక కారణాలను తెలియజేసింది. పెళ్లి చేసుకోకపోవడానికి తన కుమార్తెలు రెనీసేన్, అలీషా కారణం కానే కాదని స్పష్టం చేసింది. సుస్మితా సేన్ తాను పెళ్లి చేసుకోకపోయినా, ఇద్దరు ఆడ పిల్లలను దత్తత తీసుకుని వారిని కన్న కూతుర్లలా చూసుకుంటోంది. ఇటీవలే వెబ్ సిరీస్ ఆర్యతో సుస్మితాసేన్ అభిమానుల ముందుకు రావడం తెలిసిందే.
తాను మూడు సార్లు పెళ్లి చేసుకోవడానికి దగ్గరగా వచ్చానన్న ఆమె.. అన్ని సందర్భాల్లోనూ దేవుడే తనను కాపాడినట్టు చెప్పింది. ‘‘ఏం జరిగిందన్నది నేను చెప్పను. దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకంటే దేవుడే ఈ ఇద్దరు చిన్నారులను కాపాడుతున్నాడు. నేను గజిబిజి బంధంలో చిక్కుకు పోవాలని దేవుడు కోరుకోవడం లేదు. తన బోయ్ ఫ్రెండ్ రోమాన్ షాల్ కు ఇటీవలే సుస్మిత బ్రేకప్ చెప్పింది. ‘ఎవరైనా వచ్చి నా బాధ్యతలను పంచుకోవాలని నేను కోరుకోవడం లేదు. కానీ, వీటికి నన్ను దూరంగా ఉండాలని నన్ను అడగొద్దు’’ అని సుస్మితాసేన్ తెలిపింది.
‘‘అదృష్టవశాత్తూ నా జీవితంలో ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకున్నాను. వివాహం చేసుకోకపోవడానికి ఉన్న ఏకైక కారణం.. అతడు నన్ను నిరుత్సాహపరిచాడు. దానికీ, నా పిల్లలకు సంబంధం లేదు. నా జీవితంలోకి ఎవరు వచ్చినా రెండు చేతులతో ఆహ్వానించేందుకు నా పిల్లలు సిద్ధంగా ఉన్నారు. వారు అందరి పట్ల ఒకే ప్రేమ, గౌరవం చూపిస్తారు’’ అని సుస్మితాసేన్ వివరించింది.