ఈ రోజే టెట్ ఫలితాల విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోవచ్చు
- ఉ. 11.30 వెబ్ సైట్ లో ఫలితాలు
- గత నెల 12న జరిగిన పరీక్ష
- పేపర్ 1, 2 రాసిన ఐదున్నర లక్షల మంది
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటల నుంచి వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఫలితాలను www.tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
టెట్ పరీక్షను ప్రభుత్వం గత నెల 12న నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదున్నర పైచిలుకు మంది పరీక్ష రాశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్-1 పరీక్షను 3,18,506 (90.62 శాతం) రాశారు. పేపర్-2 పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.