కోహ్లీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాడంటే ఇక అతడిని ఆపడం ఎవరి తరం కాదు: పాక్ మాజీ సారథి మిస్బా

  • కొంతకాలంగా ఫామ్ లో లేని కోహ్లీ
  • పరుగులు సాధించేందుకు తంటాలు
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
  • కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడాలన్న మిస్బా
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా తన కెరీర్ లోనే అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల కాలంలో లయ కోల్పోయిన కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. కోహ్లీ పేలవ ఫామ్ పై పాకిస్థాన్ మాజీ సారథి మిస్బావుల్ హక్ స్పందించాడు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో కోహ్లీ ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకోవడం ఎంతో ముఖ్యమని మిస్బా అభిప్రాయపడ్డాడు. ఒక్కసారి కోహ్లీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాడంటే అతడిని ఇంకెవరూ ఆపలేరని స్పష్టం చేశాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా పరుగుల ప్రవాహం సృష్టించగలడని వివరించాడు. అయితే, అందుకు కోహ్లీ చేయాల్సిందల్లా దేశవాళీ క్రికెట్ ఆడడమేనని మిస్బా సలహా ఇచ్చాడు.

దేశవాళీల్లో నాణ్యమైన బౌలింగ్ లేకపోయినా సరే, లయ దొరకబుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. దాంతో, భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు అవసరమైన మానసిక బలం లభిస్తుందని అన్నాడు. కోహ్లీ ఫామ్ పైనే కాకుండా, తన బ్యాటింగ్ లో తలెత్తుతున్న కొన్ని లోపాలపైనా దృష్టి సారించాలని మిస్బా పేర్కొన్నాడు.


More Telugu News