బీజేపీకి షాక్... టీఆర్ఎస్‌లో చేరిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు
- మరో 3 రోజుల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు
- తాండూరు బీజేపీ ఫ్లోర్ లీడర్‌తో కలిసి బీజేపీలో చేరిక
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా నిలవనున్న హైదరాబాద్‌లో షాక్ తగిలింది. ఆమధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ టికెట్లపై కార్పొరేటర్లుగా విజయం సాధించిన వారిలో నలుగురు నేతలు బీజేపీకి గురువారం గుడ్ బై చెప్పేశారు. ఆ వెంటనే ఆ నలుగురూ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. మరో 3 రోజుల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
బీజేపీకి హ్యాండిచ్చేసి టీఆర్ఎస్‌లో చేరిన కార్పొరేటర్లలో అర్చన ప్రకాశ్, బానోతు సుజాత, వెంకటేశ్, సునీత ప్రకాశ్ గౌడ్‌లు ఉన్నారు. వీరితో పాటు తాండూరు మునిసిపాలిటీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరిస్తున్న సింధూజ కూడా బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరంతా టీఆర్ఎస్ లో చేరారు.