50 రోజులను పూర్తిచేసుకున్న 'సర్కారువారి పాట'

  • మే 12వ తేదీన వచ్చిన 'సర్కారువారి పాట'
  • ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా
  • ప్రధానమైన బలంగా నిలిచిన సంగీతం 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన సముద్రఖని నటన
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటించిన 'సర్కారువారి పాట' మే 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజుతో 50 రోజులను పూర్తి చేసుకుంది.

ఈ సినిమా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. పరశురామ్ అటు ఫారిన్ లోను .. ఇటు ఇండియాలోను ఈ కథను నడిపించాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖని గొప్పగా చేశాడు. అలాగే ఫస్టాఫ్ లో వెన్నెల కిశోర్ నవ్వులు పూయించాడు. 

ఇక తమన్ అందించిన బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా 'కళావతి' .. 'మ మ మహేశా' పాటలు ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యాయి. అలాగే రామ్ - లక్ష్మణ్ ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా కొన్ని అంశాలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి.


More Telugu News