'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నుంచి టీజర్ రిలీజ్!
- విభిన్న కథా చిత్రంగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'
- అడవి జీవితాలపై అవినీతిపరుల ప్రతాపం చుట్టూ తిరిగే కథ
- అల్లరి నరేశ్ సరసన కథానాయికగా ఆనంది
- సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
అల్లరి నరేశ్ తన తాజా చిత్రమైన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి రాజ్ మోహన్ దర్శకత్వం వహించాడు. మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో నడిచే ఈ కథలో నాయికగా ఆనంది కనిపించనుంది.
ఈ రోజున అల్లరి నరేశ్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 'మారేడుమిల్లి' అడవిలో ఓ గిరిజన గూడెం .. అక్కడ కూడా వాళ్లని ప్రశాంతంగా బ్రతకనీయకుండా చేసే రాజకీయాలు .. పోలీస్ యంత్రంగాలు. ఇద్దరి మధ్య నలిగిపోయే గిరిజనులు.
గిరిజనుల తరఫున పోరాడటం కోసం రంగంలోకి దిగిన ఒక యువకుడిగా అల్లరి నరేశ్ కనిపిస్తున్నాడు. ఇక గిరిజన గూడెంకు చెందిన యువతిగా కథానాయిక కనిపిస్తోంది. మారేడుమిల్లిలో ఇంతవరకూ ఎవరూ షూట్ చేయని ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేయడం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.