హైటెన్షన్ వైర్లపై ఉడుత పడింది... అందుకే తీగలు తెగి ఆటోపై పడ్డాయి: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు వివరణ

  • శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం
  • హైటెన్షన్ వైర్లు తెగి పడి ఆటో దగ్ధం
  • ఐదుగురు మహిళలు సజీవదహనం
  • ఉడుత కారణంగా షార్ట్ సర్క్యూట్ అయినట్టు గుర్తింపు
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం గుండంపల్లి వద్ద ఓ ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడగా, ఐదుగురు మహిళా కూలీలు సజీవదహనమయ్యారు. కాగా, ఆ హైటెన్షన్ వైర్లు తెగిపోవడానికి కారణం ఓ ఉడుత అని తేలింది. హైటెన్షన్ వైర్లపైకి ఉడుత ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ అయిందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ జరగడంతో తీగలు తెగిపోయాయని, ఆ సమయంలో అటుగా ఆటో రావడంతో దానిపై పడ్డాయని వివరించారు. 

ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణమే నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటిండెంట్ ఇంజినీర్ కు ఆదేశాలు జారీ చేసినట్టు హరినాథరావు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు విద్యుత్ శాఖ తరఫున రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున తక్షణ ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అనంతపురం ఎస్ఈని ఆదేశించినట్టు వివరించారు.


More Telugu News