మదర్సాలలో తలలు నరకమని బోధిస్తున్నారు: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్
- దైవదూషణ చేసేవారి తలలు నరకాలని మదర్సాలలో బోధిస్తున్నారన్న గవర్నర్
- ఇదే దేవుడి చట్టమని బోధిస్తున్నారని విమర్శ
- మదర్సాలలో ఏం బోధిస్తున్నారో పరిశీలించాల్సిన అవసరం ఉందన్న ఆరిఫ్
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ ను నరికి చంపిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవదూషణ చేసేవారిని నరికేయాలని మదర్సాలలో చిన్నారులకు బోధిస్తున్నారని విమర్శించారు. దేవుడి చట్టంగా ఇలాంటివి బోధిస్తున్నారని తెలిపారు.
అసలు ఖురాన్ లో ఇలాంటివి లేవని... చక్రవర్తుల కాలంలో కొంతమంది ఇలాంటి చట్టం చేశారని చెప్పారు. దీన్నే దేవుడి చట్టంగా మదర్సాలలో బోధిస్తున్నారని అన్నారు. మదర్సాలలో ఏం బోధిస్తున్నారో పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 14 ఏళ్ల వయసు వచ్చేంత వరకు పిల్లలకు బ్రాడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలని అన్నారు. మదర్సాలలో కూడా బ్రాడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మరోవైపు ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులపై చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు విదేశాలతో సంబంధాలు ఉన్నాయనే సమాచారం ఉంది.