జీతం 43 వేలే.. పొరపాటున 1.42 కోట్లు పడ్డాయి.. అతనేం చేశాడో తెలుసా?
- డబ్బంతా డ్రా చేసుకుని రిజైన్ చేసిన ఉద్యోగి
- సంస్థ మేనేజర్ ఫోన్ చేస్తే తిరిగిస్తానని హామీ
- ఫోన్ సిచ్ఛాఫ్ చేసి పరారైన ఉద్యోగి
- చిలీలోని ‘కన్సోరిస్కో’ కంపెనీలో ఘటన
అతనో సాధారణ ఉద్యోగి.. నెలకు మన కరెన్సీలో చూస్తే రూ.43 వేలు జీతం.. ప్రతినెలా ఠంచన్ గానే అతడి బ్యాంకు ఖాతాలో వేతనం సొమ్ము జమవుతూ ఉంటుంది. కానీ ఇటీవల మాత్రం జీతం కింద ఏకంగా రూ.1.43 కోట్లు ఖాతాలో పడ్డాయి. అది చూసి అవాక్కయిన సదరు ఉద్యోగి.. వెంటనే ఓ ప్లాన్ వేశాడు. డబ్బంతా డ్రా చేసుకున్నాడు. కంపెనీకి వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేశాడు. తర్వాత లెక్కలు చూసుకున్న సదరు కంపెనీ సిబ్బంది గొల్లుమన్నారు. సదరు ఉద్యోగిని అడిగితే.. సరే డబ్బు వెనక్కి ఇస్తానన్నాడు. కానీ సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారైపోయాడు. చిలీలోని ‘కన్సోరిస్కో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్’ సంస్థలో ఈ నిర్వాకం జరిగింది.
286 రెట్లు ఎక్కువగా వేసి..
చిలీలో ప్యాకేజ్డ్ మాంసాహారాన్ని విక్రయించే అతిపెద్ద కంపెనీల్లో కన్సోరిస్కో ఒకటి. అందులో పనిచేసే ఓ ఉద్యోగి (అతడి పేరు వెల్లడించలేదు)కి జీతం 5 లక్షల పెసోలు (మన కరెన్సీలో రూ.43 వేలు). కంపెనీ హెచ్ ఆర్ సిబ్బంది జూన్ నెలలో అతడి బ్యాంకు ఖాతాలో పొరపాటున 16,53,98,851 పెసోలు (మన కరెన్సీలో సుమారు రూ.1.43 కోట్లు) జీతంగా జమ చేశారు. ఇది అతడికి చెల్లించాల్సిన జీతం కంటే ఏకంగా 286 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
తర్వాత దీనిని గమనించిన హెచ్ ఆర్ మేనేజర్ సదరు ఉద్యోగికి ఫోన్ చేసి అడిగాడు. కానీ అప్పటికే సదరు ఉద్యోగి బ్యాంకులోంచి విత్ డ్రా చేసుకున్నాడు. కంపెనీకి రాజీనామా చేస్తున్నట్టు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. అయినా బ్యాంకుకు వెళ్లి తిరిగి కంపెనీకి రీఫండ్ చేయాలని కోరుతానని అబద్ధం చెప్పాడు. తర్వాత పరారయ్యాడు. దీంతో కంపెనీ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది జరిగి దాదాపు నెల రోజులైనా ఆ ఉద్యోగి ఎక్కడున్నాడో చిక్కలేదట.