ఇడుపులపాయలో గ్రామ సచివాలయానికి తాళం!... కారణమేంటంటే..!
- ఆర్బీకే ఏర్పాటుపై వైసీపీలోని రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు
- ఇడుపులపాయలోనే ఆర్బీఏ ఏర్పాటు చేయాలన్న ఓ వర్గం
- వర్షానికి మునిగే ప్రాంతంలో ఆర్బీకే వద్దన్న మరో వర్గం
కడప జిల్లా ఇడుపులపాయలోని గ్రామ సచివాలయానికి అధికార పార్టీ శ్రేణులే తాళాలు వేశారు. గ్రామానికి చెందిన వైసీపీలో రెండు వర్గాలు ఉండగా... ఓ వర్గం శ్రేణులు గ్రామ సచివాలయానికి తాళం వేసి అక్కడే ధర్నాకు దిగారు. ప్రత్యర్థి వర్గంతో వారు వాదులాటకు దిగారు. తదనంతరం ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఈ ఘటనకు దారి తీసిన వివరాల్లోకెళితే... ఇడుపులపాయలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) ఏర్పాటుకు సంబంధించి గ్రామ వైసీపీ శాఖలోని రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇడుపులపాయలో గ్రామ సచివాలయం సమీపంలోనే ఆర్బీకేను ఏర్పాటు చేయాలని ఓ వర్గం వాదించింది. అయితే వర్షం పడితే ఆ ప్రాంతం నీట మునుగుతుందని, అలాంటి ప్రాంతంలో ఆర్బీకే ఏర్పాటు వద్దని ఇంకో వర్గం వాదించింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. అనంతరం వైంపల్లె జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి వద్ద ఇరు వర్గాలు పంచాయితీ పెట్టాయి.