మన శరీరం ఏడేళ్లకోసారి సరికొత్తగా.. అదెలా?
- దాదాపు అన్ని అవయవాల్లో కొత్త కణాలు
- కొన్నింటిలో వేగంగా.. మరికొన్నింటిలో మెల్లగా భర్తీ
- మెదడు, గుండె కణాల్లో చాలా వరకు జీవితాంతం అవే..
- జీవసంబంధిత వయసు వల్ల అసలు వయసు పెరుగుతుందన్న శాస్త్రవేత్తలు
మన శరీరంలో కొన్ని లక్షలాది కోట్ల కణాలు ఉంటాయి. శారీరక ప్రక్రియల్లో భాగంగా రోజూ కోట్లాది కణాలు దెబ్బతిని చనిపోతూ, వాటి స్థానంలో కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. దాదాపు అన్ని అవయవాల్లో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చర్మం, జీర్ణ వ్యవస్థలో కణాల పునరుత్థానం చాలా వేగంగా ఎక్కువగా ఉంటుంది. రక్త కణాల జీవిత కాలం కూడా కొద్ది రోజులే ఉంటుంది.
అయితే, కొన్ని అవయవాల్లో కణాలు చనిపోవడం, కొత్తవి జన్మించడం చాలా మెల్లగా సాగుతుంది. మొత్తంగా చూస్తే.. మన శరీరం దాదాపు ప్రతి ఏడు సంవత్సరాలకోసారి దాదాపు కొత్తగా మారిపోతుంది. కానీ కొన్ని కణాలు మాత్రం మనం పుట్టిన నాటి నుంచి మరణించే వరకు కూడా అలాగే ఉంటాయని స్వీడన్ లోని కరోలిన్ స్కా యూనివర్సిటీ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్త ఓలాఫ్ బెర్జ్ మాన్ వెల్లడించారు.
కొత్త కణాలు పుడుతున్నా వయసు ఎందుకు పెరుగుతుంది?
శరీరంలో తరచూ కొత్త కణాలు పుడుతూ ఉన్నా కూడా మన వయసు ఎందుకు పెరుగుతుంది? అన్నీ కొత్త కణాలే అయినప్పుడు మనం వృద్ధులం ఎందుకు అవుతామనే సందేహాలు వస్తున్నాయి కదా. దీనికి మన శరీర జీవసంబంధిత వయసు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

- మన చర్మం బయటి పొర, జీర్ణాశయం, పేగుల లోపలి పొరల్లో కణాలు కేవలం 15 రోజుల కోసారి కొత్తగా భర్తీ అవుతూ ఉంటాయి.
- మన కాలేయంలోని కణాలు ప్రతి మూడేళ్ల కోసారి కొత్తవి ఏర్పడుతాయి.
- మన గుండెలో అత్యంత కీలకమైన కార్డియో మయోసైట్స్ కణాలు మొత్తం మన జీవిత కాలంలో 40 శాతం వరకు కొత్తవి పుడతాయి.
- ఎముకలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయని భావిస్తుంటాం. కానీ ఎముకల్లోని కణాలు కూడా దశలు దశలుగా కొత్తవి వస్తూ దాదాపు పదేళ్లలో పూర్తిగా కొత్తగా మారిపోతాయి.
- శరీరంలో అన్నింటికన్నా అతి తక్కువగా మారేవి మెదడు, నాడీ వ్యవస్థలోని కణాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా మెదడులోని ప్రధాన నాడీ కణాలు జీవితాంతం అలాగే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. కొన్ని రకాల నాడీ కణాలు మాత్రం దాదాపు పదేళ్ల కోసారి భర్తీ అవుతాయని వివరిస్తున్నారు.
కొత్త కణాలు పుడుతున్నా వయసు ఎందుకు పెరుగుతుంది?
శరీరంలో తరచూ కొత్త కణాలు పుడుతూ ఉన్నా కూడా మన వయసు ఎందుకు పెరుగుతుంది? అన్నీ కొత్త కణాలే అయినప్పుడు మనం వృద్ధులం ఎందుకు అవుతామనే సందేహాలు వస్తున్నాయి కదా. దీనికి మన శరీర జీవసంబంధిత వయసు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
- మన శరీరంలో కొత్త కణాలు పుట్టే విధానం భిన్నంగా ఉంటుందని.. కొత్త కణం పుట్టినప్పుడు అంతకుముందు అక్కడ ఉన్న కణాన్ని పోలినట్టుగానే ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
- ఉదాహరణకు 50 ఏళ్ల వ్యక్తిలో చర్మ కణాలు భర్తీ అయినప్పుడు.. ఆ ప్రదేశంలో ముందున్న కణానికి ఉన్న వయసు, లక్షణాలు అలాగే కొత్త కణంలోనూ ఉంటాయని పేర్కొంటున్నారు. అంటే సాంకేతికంగా కణాలు కొత్తవి అయినా.. వాటి వయసు మాత్రం ఎక్కువేనని చెబుతున్నారు.
- శరీర కణాలు ఎప్పుడూ కూడా విభజన చెందడం ద్వారా కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయని.. ఈ సమయంలో డీఎన్ఏ కూడా విభజన చెందుతూ పాత కణానికి చెందిన జీవసంబంధిత వయసు, ఇతర అంశాలను కొత్త కణాలకు ఆపాదిస్తుందని శాస్త్రవేత్త ఓలాఫ్ బెర్జ్ మాన్ వివరించారు.
- మన మెదడుతోపాటు పలు కీలక అవయవాల్లో ఎప్పుడూ మారకుండా ఉండే కణాలు.. మన శరీర జీవసంబంధిత వయసును నిర్ధారిస్తాయని తెలిపారు.