బిల్ గేట్స్ తో మహేశ్, నమ్రత.. వైరల్ అవుతున్న ఫొటో!

  • విదేశీ పర్యటనలో ఉన్న మహేశ్ బాబు
  • న్యూయార్క్ లో బిల్ గేట్స్ ను కలిసిన వైనం
  • ప్రపంచంలోని అతి గొప్ప విజనరీల్లో బిల్ గేట్స్ ఒకరని ప్రశంస
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా మిక్స్ డ్ రివ్యూలను తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా మాత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. మహేశ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. 

మరోవైపు గత కొన్ని రోజులుగా తన కుటుంబంతో కలిసి మహేశ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి... న్యూయార్క్ సిటీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మహేశ్ షేర్ చేశాడు. 'బిల్ గేట్స్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచంలోని అతి గొప్ప విజనరీల్లో ఆయనొకరు. అంతకంటే ఎక్కువ వినయవంతులు. నిజంగా ఒక స్ఫూర్తి' అని మహేశ్ కామెంట్ చేశాడు. 

మరో రెండు రోజుల్లో ఇండియాకు రానున్న మహేశ్... తొలుత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా స్క్రిప్ట్ ను విననున్నాడు. జులైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో మహేశ్ సరసన నటించనుంది.


More Telugu News