కొడుక్కి జియో సరే.. మరి కూతురికి ముకేశ్ అంబానీ ఏమి ఇవ్వనున్నారు?

  • ముకేశ్ అంబానీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
  • ఆకాశ్ అంబానీకి రిలయన్స్ జియో వ్యాపారం
  • ఇషా అంబానీకి రిలయన్స్ రిటైల్
  • దీనిపై రిలయన్స్ ప్రకటన చేస్తుందన్న సమాచారం
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ఇద్దరు కుమారులు ఆకాశ్, అనంత్. కుమార్తె ఇషా ఉన్నారు. వీరిలో ఆకాశ్ అంబానీని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ గా ముకేశ్ నియమించారు. రిలయన్స్ జియో అతిపెద్ద టెలికం కంపెనీ అన్న విషయం తెలిసిందే. జియో ప్లాట్ ఫామ్ లో గూగుల్, ఫేస్ బుక్ వంటి దిగ్గజ సంస్థలకు వాటాలున్నాయి. దీన్ని ఆకాశ్ కు దాదాపు కట్టబెట్టినట్టే.

ఇప్పుడు కూతురు ఇషా అంబానీ వంతు రానుంది. ఆమె ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ బోర్డులో డైరెక్టర్ గా ఉన్నారు. ఆమెను దానికి చైర్మన్ గా ప్రకటించే అవకాశం ఉందని, త్వరలోనే ప్రకటన వెలువడవచ్చని సంస్థ సన్నిహిత వర్గాల వెల్లడించాయి. ఆకాశ్, ఇషా కవలలు. వీరి వయసు 30 సంత్సరాలు. ఇక అనంత్ వయసు 27 ఏళ్లు. ఇషా అంబానీ యేల్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చారు. 

ఇక అనంత్ ఒక్కడే మిగులుతాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంప్రదాయ వ్యాపారాలైన చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ వ్యాపారం ఉండడం తెలిసిందే. దీనికితోడు గ్రీన్ హైడ్రోజన్ సహా పునరుత్పాదక ఇంధనాలపై రిలయన్స్ పెద్ద ఎత్తున పనిచేస్తోంది. దీన్ని ముకేశ్ చిన్న కొడుక్కి తర్వాత కట్టబెట్టొచ్చు.


More Telugu News