దీపక్ హుడా సక్సెస్.. సెలక్టర్లకు సంకటస్థితి!
- గతంలో ఎన్నడూ ఇన్నింగ్స్ ఆరంభించలేదన్న హుడా
- సవాళ్లను స్వీకరించాల్సిందేనని వ్యాఖ్య
- వేరే అవకాశం లేనప్పుడు ఎందుకు పోరాడకూడదని ప్రశ్న
దీపక్ హుడా.. ఈ పేరు క్రికెట్ అభిమానులకు సైతం పెద్దగా పరిచయం లేనిది. ఐపీఎల్ 2022 సీజన్ లో లక్నో జట్టు తరఫున అవకాశం లభించడంతో దీపక్ హుడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో ఐర్లాండ్ తో రెండు టీ20 మ్యాచుల కోసం బీసీసీఐ హుడాకు అవకాశం ఇచ్చింది. గాయం కారణంగా రుతురాజ్ దూరంగా ఉండడంతో ఆ అవకాశం హుడాకు దక్కింది. దీంతో మొదటి మ్యాచ్ లో 47 పరుగులతో అతడు తన సత్తా చాటాడు. రెండో మ్యాచ్ లోనూ సెంచరీ సాధించి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు.
ఐర్లాండ్ తో రెండు మ్యాచుల్లోనూ రాణించడంతో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో హుడాకు చోటు దాదాపు ఖాయమనే అనుకోవచ్చు. ఐర్లాండ్ తో రెండో మ్యాచ్ అనంతరం హుడా మీడియాతో మాట్లాడాడు. తాను గతంలో ఏ స్థాయిలోనూ ఇన్నింగ్స్ ను ప్రారంభించలేదని స్పష్టం చేశాడు.
"అంతర్జాతీయ మ్యాచులే కాదు. మరే ఇతర మ్యాచ్ లోనూ నేను ఇన్నింగ్స్ ఆరంభించలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మ్యాన్ గా మన ముందున్న సవాళ్లను స్వీకరించాలి. నీ ముందు మరో అవకాశం లేనప్పుడు ఒక యోధుడిగా ముందుకు ఎందుకు వెళ్లకూడదు? నేను ఇలానే ఆలోచిస్తాను’’ అని హుడా వివరించాడు.
షార్ట్ బాల్స్ ను ఆనందంగా ఎదుర్కొంటానని హుడా చెప్పాడు. తాజా ప్రదర్శన చూసిన తర్వాత సెలక్టర్లు టీ20 ప్రపంచకప్ జట్టులో హుడాకు చోటివ్వడం ఖాయమనే తెలుస్తోంది. కానీ, ఆప్షన్లు పెరిగిపోవడంతో ఎంపిక అన్నది సెలక్టర్లకు సవాలుగా మారిపోయింది. రోహిత్ శర్మతోపాటు, ఇతర సీనియర్ ఆటగాళ్లు అందరూ ఫిట్ గానే ఉన్నారు. రోహిత్, కేఎల్ రాహుల్ తోపాటు ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి.
"అంతర్జాతీయ మ్యాచులే కాదు. మరే ఇతర మ్యాచ్ లోనూ నేను ఇన్నింగ్స్ ఆరంభించలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మ్యాన్ గా మన ముందున్న సవాళ్లను స్వీకరించాలి. నీ ముందు మరో అవకాశం లేనప్పుడు ఒక యోధుడిగా ముందుకు ఎందుకు వెళ్లకూడదు? నేను ఇలానే ఆలోచిస్తాను’’ అని హుడా వివరించాడు.