మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ
- పలు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న కరోనా వ్యాప్తి
- రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్రం
- కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టీకరణ
కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది. దీనిపై కేంద్రం స్పందించింది. కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
త్వరలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యాత్రలు ప్రారంభం కానున్నాయని, పండుగల సీజన్ వస్తోందని తెలిపారు. దీనివల్ల ప్రజలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారని, ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సూచించారు. కరోనా పరీక్షల నిర్వహణ, నిర్ధారణ, వైద్యం, వ్యాక్సినేషన్ వంటివి కొనసాగించాలని లేఖలో స్పష్టం చేశారు. కొవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు, జిల్లా యంత్రాంగం వ్యాక్సినేషన్ సమగ్రస్థాయిలో పూర్తిచేసేందుకు కృషి చేయాలని తెలిపారు.