ఏపీ ఎంసెట్ (ఈఏపీ సెట్) హాల్ టికెట్ల డౌన్ లోడ్ వివరాలు ఇవిగో!
- జులై 4 నుంచి 12 వరకు ఎంసెట్
- నిన్న హాల్ టికెట్ల విడుదల
- అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు
- ఆగస్టు 15న ఎంసెట్ ఫలితాలు
ఏపీలో జులై 4 నుంచి 12వ తేదీ వరకు ఎంసెట్ (ఈఏపీ సెట్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, నిన్న (జూన్ 27) హాల్ టికెట్లు విడుదల చేశారు. వాస్తవానికి ఎంసెట్ హాల్ టికెట్లు నిన్న సాయంత్రం విడుదల అవుతాయని భావించగా, మధ్యాహ్నం నాటికే హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఈఏపీ సెట్ కు గత ఏప్రిల్ 11న నోటిఫికేషన్ వెలువడింది.
కాగా, హాల్ టికెట్లను cets.apsche.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో డౌన్ లోడ్ ఏపీ ఈఏపీసెట్ 2022 హాల్ టికెట్ అన్న లింక్ పై క్లిక్ చేయాలి. ఆపై అప్లికేషన్ నెంబరు, ఇతర వివరాలను నింపాలి. దాంతో స్క్రీన్ పై హాల్ టికెట్ దర్శనమిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు జులై 4 నుంచి 8 వరకు.... అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జులై 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆగస్టు 15న ఎంసెట్ పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారు.