30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
- రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే పాసైన టెన్త్ విద్యార్థులు
- ఈ క్రమంలో ఈ ఏటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
- ఇంటర్ ఫలితాలు వెల్లడైన రెండు రోజులకే టెన్త్ రిజల్ట్స్
తెలంగాణలో పదో తరగతి ఫలితాల వెల్లడికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 (గురువారం) టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు విడుదలైన రెండు రోజుల్లోనే టెన్త్ ఫలితాలు విడుదల కానుండటం గమనార్హం.
కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్న వైనం తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏ మేర ఉత్తీర్ణత సాధిస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.