ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు

  • అల్లూరి జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులు
  • కోరుకొండ, పెదబయలు దళాలకు చెందినవారు లొంగుబాటు
  • ఈ సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి
ఏపీలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లాలో పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా.. మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు. లొంగిపోయిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్య కేసు నిందితులు కూడా ఉన్నట్టు సమాచారం. కోరుకొండ, పెదబయలు దళాలకు చెందిన మావోలు లొంగిపోయారు. 

ఇంత పెద్ద సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారి. మరోవైపు మావోయిస్టుల డంప్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు డీఐజీ హరికృష్ణ, ఎస్పీ సతీశ్ తెలిపారు. ఇందులో రూ. 39 లక్షల నగదు, 9 ఎంఎం పిస్టల్, 2 ల్యాండ్ మైన్లు, బ్యాటరీలు, వైర్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.


More Telugu News