వచ్చే ఎన్నికల్లో పోటీ దేవుడెరుగు మధ్యలో కూర్చోకుండా అరగంట నిలబడగలడా?: కొడాలి నానిపై బుద్ధా వెంకన్న ఎద్దేవా

  • 2014 ఎన్నికలే వైసీపీకి చివరివన్న వెంకన్న
  • వైసీపీని జగన్ కబ్జా చేశారని ఆరోపణ
  • తల్లి, చెల్లిని మోసం చేశారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నానిపై  టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. 2024 ఎన్నికలే వైసీపీకి చివరివన్నారు. తలకిందులు తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవదన్నారు. శివకుమార్ పెట్టిన వైసీపీ పార్టీని జగన్ కబ్జా చేశారని విమర్శించారు. సొంత తల్లి, చెల్లిని రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారని, అధికారంలోకి రాగానే వాళ్లను బయటకు గెంటేశాడని ఆరోపించారు. 

‘మీ కోసం వైసీపీ పార్టీ పెట్టింది శివ కుమార్. ఆ పార్టీని కబ్జా చేసిన నీచుడు జగన్ రెడ్డి. సొంత తల్లిని, తోడబుట్టిన చెల్లిని రాజకీయాలు కోసం వాడుకుని అధికారం వచ్చాక ఇంటి నుండి మెడ పట్టి బయటకు గెంటేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. తలకిందులుగా తపస్సు చేసినా కూడా వచ్చే ఎన్నికల్లో బాబాయ్ ని చంపేసి, తల్లిని, చెల్లిని మోసం చేసిన పాపం వదిలిపెట్టదు. 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు’ అని వరుస ట్వీట్లు చేశారు. 

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై కూడా బుద్దా వెంకన్న విమర్శలు చేశారు. తనది గుడివాడ అని, 2024, 2029 ఎన్నికల్లో కూడా తనే గెలుస్తానని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘వచ్చే ఎన్నికల్లో పోటీ దేవుడెరుగు గుట్కా నాని మధ్యలో కూర్చోకుండా అరగంట నిలబడగలడా?’ అని ఎద్దేవా చేశారు.


More Telugu News