మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిచ్చిన మేధావి పీవీ నరసింహారావు గారు: చంద్రబాబు

మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిచ్చిన మేధావి పీవీ నరసింహారావు గారు: చంద్రబాబు
  • నేడు పీవీ 101వ జయంతి
  • నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు
  • దేశాన్ని గట్టెక్కించిన నేత అని కొనియాడిన చంద్రబాబు
  • టీడీపీ కార్యాలయంలో పీవీకి పుష్పాంజలి
భారత దేశాన్ని ఆధునిక మార్గం పట్టించిన సంస్కరణలకు ఆద్యుడు, తెలుగుజాతి గర్వించదగిన నేత పీవీ నరసింహారావు 101వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పీవీని స్మరించుకున్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేశారని, ప్రధానిగా ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని కొనియాడారు. మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిచ్చిన మేధావి పీవీ నరసింహారావు గారు అంటూ చంద్రబాబు కీర్తించారు. తెలుగు వెలుగు పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి దేశసేవను స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఆఫీసులో పీవీ చిత్రపటానికి చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు.


More Telugu News