జర్మనీ పర్యటన ముగించుకుని యూఏఈ పయనమైన ప్రధాని మోదీ

జర్మనీ పర్యటన ముగించుకుని యూఏఈ పయనమైన ప్రధాని మోదీ
  • రెండ్రోజుల పాటు జర్మనీలో పర్యటన
  • మ్యూనిచ్ లో జీ7 దేశాల సదస్సుకు హాజరు
  • పర్యటన సంతృప్తికరంగా సాగిందన్న మోదీ
  • ప్రత్యేక విమానంలో యూఏఈ తరలి వెళ్లిన వైనం
ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల జర్మనీ పర్యటన ముగిసింది. జీ7 దేశాల సదస్సు కోసం జర్మనీ విచ్చేసిన మోదీ అగ్రదేశాధినేతలతో సమావేశాలతో బిజీగా గడిపారు. పర్యటన ముగింపు సందర్భంగా, మ్యూనిచ్ వేదికగా జరిగిన జీ7 దేశాల సదస్సు సంతృప్తికరంగా సాగిందని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత తదితర అంశాలపై వివిధ దేశాధినేతలతో విస్తృత చర్చలు జరిపినట్టు తెలిపారు. ఈ సదస్సు తనకెన్నో మధురానుభూతులు మిగిల్చిందని వివరించారు. 

కాగా, జర్మనీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ యూఏఈ పర్యటనకు తరలి వెళ్లారు. ప్రత్యేక విమానంలో జర్మనీ నుంచి బయల్దేరిన మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకోనున్నారు. గత మే నెలలో 13వ తేదీన కన్నుమూసిన యూఏఈ మాజీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ కు మోదీ నివాళులు అర్పించనున్నారు.


More Telugu News