తాను తీసిన ఫొటోలను కోహ్లీ పోస్ట్ చేయడంపై ఇంగ్లిష్ ఫొటోగ్రాఫర్ స్పందన

  • లీచెస్టర్ షైర్ ప్రాక్టీస్ మ్యాచ్ ఫొటోలు తీసిన జాన్ మాలెట్
  • వాటిని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసుకున్న కోహ్లీ
  • అమితానందాన్ని వ్యక్తం చేసిన మాలెట్
ఇంగ్లిష్ ఫొటో గ్రాఫర్ జాన్ మాలెట్ ఇటీవల లీచెస్టర్ షైర్ లో భారత్, ఇంగ్లండ్ జట్ల ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా క్రికెటర్ల ఫొటోలను క్లిక్ మనిపించారు. నార్విచ్ కు చెందిన మాలెట్ కు క్రీడలంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఆటలకు సంబంధించి ఫొటోలను తీస్తుంటారు. ఇందులో భాగంగానే లీచెస్టర్ షైర్ లో ప్రాక్టీస్ మ్యాచ్ దృశ్యాలను కూడా తన కెమెరాలో బంధించారు. 

ఇందులో విరాట్ కోహ్లీ తనకు సంబంధించి మూడు ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇందులో రెండు ఫొటోల్లో ఆట ఆడుతున్న సందర్భాలు. మూడోది ప్రాక్టీస్ కోసం కోహ్లీ బ్యాగ్ తో వెళుతున్న దృశ్యం. ‘‘థ్యాంక్యూ లీచెస్టర్. బర్మింగ్ హమ్ వేచి చూస్తోంది’’అని కోహ్లీ పోస్ట్ పెట్టారు.

తాను తీసిన ఫొటోలను కోహ్లీ వాడుకోవడంపై జాన్ మాలెట్ ట్విట్టర్లో స్పందించారు. ‘‘ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకరు నేను తీసిన ఫొటోలను వినియోగించుకోవడం ఎంతో గొప్పగా భావిస్తున్నాను. ఈ షాట్ లను తీయడాన్ని విశేషంగా భావిస్తున్నా. మద్దతుగా నిలిచిన వీకే, ప్రతి ఒక్కరూ, బీసీసీఐకి ధన్యవాదాలు’’అని మాలెట్ తెలిపారు.


More Telugu News