ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్

  • మూడో టెస్టులోనూ ఇంగ్లండ్ గెలుపు.. సిరీస్ క్లీన్ స్వీప్
  • ఏడు వికెట్ల తేడాతో ఓడిన న్యూజిలాండ్
  • రాణించిన రూట్, బెయిర్ స్టో
ప్రపంచ టెస్టు చాంపియన్, టెస్టుల్లో అగ్ర జట్టుగా వెలుగొందుతున్న న్యూజిల్యాండ్‌ను మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లండ్ చిత్తుగా ఓడించి సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత సొంతగడ్డపై ఓ సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకుంది. ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

న్యూజిలాండ్‌ నిర్ధేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 183/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. ఓలీ పోప్‌ (82) వికెట్‌ను తొందరగానే కోల్పోయంది. అయితే మాజీ కెప్టెన్ జో రూట్‌ (86 నాటౌట్‌) తన ఫామ్ కొనసాగించగా... జానీ బెయిర్‌స్టో 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 71  పరుగులు చేసి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

తొలి రెండు టెస్టుల్లోనూ ఓడిపోయిన న్యూజిలాండ్ వైట్ వాష్ తప్పించుకోలేకపోయింది. ఈ సిరీస్ లో మూడు టెస్టులలో కలిపి రూట్ (396 పరుగులు) జానీ బెయిర్‌స్టో (394 పరుగులు) అద్భుతంగా రాణించి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.


More Telugu News