మహీంద్రా ఎక్స్ యూవీ700 కావాలంటే.. రెండేళ్లు వేచి ఉండాల్సిందే!
- 70,000 బుకింగ్ లు.. డెలివరీకి 22 నెలలు
- చిప్ ల కొరతతో తయారీకి సమస్యలు
- ఇప్పటికిప్పుడు ఇది పరిష్కారం కాదంటున్న మహీంద్రా
మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారు కోసం వేచి ఉండే జాబితా పెరిగిపోతోంది. బుక్ చేసుకుని 22 నెలలు వేచి ఉంటేనే ఈ కారు కీ చేతికి వచ్చే పరిస్థితి నెలకొంది. దీనికి రెండు అంశాలు ప్రధాన కారణం. ఒకటి ఈ కారుకు డిమాండ్ ఎక్కువగా ఉండడం. రెండోది సెమీకండక్టర్ చిప్ లకు కొరత నెలకొనడం. కార్ల తయారీలో చిప్ ల పాత్ర కీలకం. దీంతో డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి చేసే అనుకూలత లేదు. ఫలితంగా వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది.
ఎక్స్ యూవీ 700ను గతేడాది అక్టోబర్ లో మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని కోసం 70,000 బుకింగ్ లు వచ్చినట్టు కంపెనీ ఈడీ రాజేష్ జెజూరికర్ తెలిపారు. ఒకవేళ చిప్ ల కొరత పరిష్కారమైనా, సరఫరాలో సమస్యల వల్ల ఇప్పటికిప్పుడు వేగంగా ఈ కారును బుక్ చేసుకున్న వారికి అందించే పరిస్థితి లేదని రాజేష్ చెప్పారు.
ఎక్స్ యూవీ 700లో అతిపెద్ద సన్ రూఫ్ ఉంటుంది. ఆటో బూస్టర్ హెడ్ లైట్లు మరో ప్రత్యేకత. చీకటి ప్రదేశాల్లో వెళుతున్నప్పుడు అదనపు హెడ్ లైట్లు ఆన్ అవుతాయి. అలాగే, వేగం పరిమితి దాటితే హెచ్చరించే వ్యవస్థ కూడా ఉంది. కారు డోర్ వద్దకు రాగానే తెరుచుకునే డోర్ హ్యాండిల్స్ మరో స్పెషల్ ఫీచర్. దీని ఎక్స్ షోరూమ్ ధరలు రూ.13.18 లక్షల నుంచి మొదలవుతున్నాయి.