జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు
- ఒక్కో నేతకు వివిధ రకాల ఉత్పత్తులు
- యూపీలోని వివిధ జిల్లాల్లో తయారైన వాటికి ప్రచారం
- జర్మనీ పర్యటనను అనుకూలంగా చేసుకున్న ప్రధాని మోదీ
జీ7 దేశాధినేతల సమావేశాన్ని భారత ఉత్పత్తుల ప్రచారానికి వేదికగా మలుచుకున్నారు ప్రధాని మోదీ. ఒక్కో నేతకు ఒక ప్రత్యేక ఉత్పత్తిని బహుమతిగా అందించారు. అవన్నీ ఉత్తరప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో తయారైనవి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ప్రోత్సహించే ఒక పథకాన్ని అమలు చేస్తుండడం గమనార్హం. రెండు రోజుల జీ-7 సమావేశానికి ప్రధాని జర్మనీ వెళ్లడం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ‘గులాబీ మీనాకారి’ అనే చేతి ఉత్పత్తిని ప్రధాని మోదీ బహూకరించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో వెండితో చేసే వివిధ రకాల ఉత్పత్తులను ‘బెనారస్ గులాబి మీనాకారి’ పేరుతో మార్కెటింగ్ చేస్తుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ కు లక్నోలో చేసిన క్యారియర్ బాక్స్ ను అందించారు. ఖాదీ సిల్క్, ఫ్రెంచ్ జాతీయ పతాకంలోని మూడు రంగులతో ఉన్న శాటిన్ టిష్యూ పై ఎంబ్రాయిడరీ చేశారు. అలాగే, యూపీలోని కన్నౌజ్ లో తయారు చేసే అత్తర్ మిట్టి (అత్తర్)ని కూడా అందించారు. ఈ రెండింటినీ జరీ జర్దోజీ బాక్స్ లో పెట్టి ఇచ్చారు.