సీపీఐ రామకృష్ణ గారికి సిగ్గుగా అనిపించడం లేదా?: విష్ణువర్ధన్ రెడ్డి
- గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటు
- రబ్బరు స్టాంప్ రాష్ట్రపతి అవుతుందనడానికి సిగ్గుగా లేదా?
- గిరిజనుల మీద ద్వేషాన్ని వెళ్లగక్కడం దురదృష్టకరం
ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. గిరిజన అభ్యర్థి రబ్బరు స్టాంప్ రాష్ట్రపతి అవుతుందని అనడానికి రామకృష్ణ గారికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారి గిరిజనులకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వస్తే... అది చూసి ఓర్వలేని కమ్యూనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా కనీసం ఉనికి లేకపోయినా, ప్రజలు ఛీత్కరించినా... వారి ఆలోచనల్లో మార్పు రాకపోగా గిరిజనుల మీద తమ ద్వేషాన్ని వెళ్లగక్కడం దురదృష్టకరమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.