కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు!
- గత 24 గంటల్లో 11,793 కొత్త కేసులు
- దేశ వ్యాప్తంగా 27 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 96,700
దేశంలో కరోనా ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,793 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 9,486 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 96,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,18,839కి పెరిగింది. వీరిలో 4,27,97,092 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,047 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.57 శాతంగా, క్రియాశీల రేటు 0.22 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,97,31,43,196 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 19,21,811 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.