ఆ మూడూ ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ!... పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ ఆఫర్!
- పాత బకాయిలు, వడ్డీ, ఆస్తిపన్ను ఒకేసారి చెల్లిస్తేనే ఆఫర్
- జులై 31లోగా చెల్లించిన వారికే ఈ ఆఫర్ వర్తింపు
- ప్రకటనను విడుదల చేసిన ఏపీఐఐసీ
- అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పారిశ్రామికవేత్తలకు పిలుపు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పిన పారిశ్రామికవేత్తలకు సోమవారం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయిలతో పాటు వడ్డీ, ఆస్తి పన్ను... ఈ మూడింటిని ఒకేసారి చెల్లిస్తే... ఆ మొత్తంలో నుంచి 5 శాతాన్ని రాయితీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే జులై 31లోగా చెల్లించిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందంటూ ప్రభుత్వం ఓ షరతు విధించింది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వంలో అంతర్భాగమైన ఏపీఐఐసీ సోమవారం సాయంత్రం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ పిలుపునిచ్చింది. ఈ సరికొత్త పథకంపై అప్పుడే విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆదాయ వనరులను పెంచుకునేందుకే ఈ ఆఫర్‌ను ప్రభుత్వం ప్రకటించిందని విపక్షాలు ఆరోపించాయి.